కిశోరి వికాసం పై అవగాహన కార్యక్రమం

ELR: జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్ షిప్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 'కిశోరి వికాసం' కార్యక్రమం నిర్వహించారు. ICDS ప్రాజెక్ట్ సూపర్వైజర్ విజయ లక్ష్మీ బాలికలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించి వారికున్న హక్కులను వివరించారు. ఈనెల 2 నుంచి జూన్ 10 వరకు శిక్షణ తరగతులు జరుగుతున్నట్లు చెప్పారు.