CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నిన్న పెదవేగి మండలం పెదకడిమిలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. చల్లగోళ్ల వెంకట సత్య రమాదేవికి రూ.12,17,380, చల్లగోళ్ల గాంధీ వరప్రసాద్‌కి రూ.20,000, చల్లగోళ్ల అనంతలక్ష్మికి రూ.77,797 దేవినేని సత్యనారాయణకి రూ.41,000 విలువగల CMRF చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.