తొక్కిసలాటలో ఇలా తప్పించుకోవాలి!
రద్దీ ప్రదేశాల్లో తొక్కిసలాట జరిగితే ఎలా తప్పించుకోవాలో పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఒకరికొకరు నెట్టుకోవడంతో.. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటప్పుడు మన రెండు చేతులను ఛాతికి ముందు బాక్సింగ్ పొజిషన్‌లో పెట్టుకోవాలి. జనాలందరూ ఒకవైపు వెళ్తుంటే వ్యతిరేక దిశలో వెళ్లకూడదు. ఒకవేళ కింద పడిపోతే పక్కకు తిరగాలని చెప్పారు.