108లో మహిళ ప్రసవం, తల్లిబిడ్డ క్షేమం

108లో మహిళ ప్రసవం, తల్లిబిడ్డ క్షేమం

NZB: నందిపేట మండలానికి చెందిన ఓ గర్భిణిని ఆదివారం ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. అప్రమత్తమైన 108 సిబ్బంది అంబులెన్స్ ఆపి సుఖప్రసవం చేశారు. మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను క్షేమంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసవం చేయించడంపై వైద్యులు వారిని అభినందించారు.