డీఎంకే ఉన్నంతకాలం బీజేపీకి అధికారం దక్కదు: స్టాలిన్

డీఎంకే ఉన్నంతకాలం బీజేపీకి అధికారం దక్కదు: స్టాలిన్

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు, ఎన్డీయేకు మధ్య జరుగుతాయని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ టీమ్ గెలుస్తుందా? తమిళనాడు టీమ్ గెలుస్తుందా? అన్న అంశంపై ఆధారపడే ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు. బీజేపీ కుతంత్రాలను తాను ఉన్నంత వరకు రాష్ట్రంలో పని చేయవని పేర్కొన్నారు. తన పార్టీ పని చేస్తున్నంత కాలం తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని నొక్కి చెప్పారు.