VIDEO: గూడూరులో ఫ్లాగ్ మార్చ్
MHBD: గూడూరు మండల కేంద్రంలో పోలీసులు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మార్చ్ నిర్వహించినట్లు వారు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.