విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: మంత్రి

విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: మంత్రి

HNK: జిల్లా కేంద్రంలో వరంగల్, హనుమకొండ కలెక్టర్లు, ఎస్సీ వెల్ఫేర్ అధికారులతో శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలోని సంక్షేమ, గురుకుల పాఠశాలలు, వసతి గృహాల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించాలని మంత్రి అధికారులకు సూచించారు.