పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని దెబ్బ!
MDK: జిల్లాలో 'కొక్కెర వ్యాధి' పౌల్ట్రీ రైతులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఈ వైరస్ కారణంగా తూప్రాన్, కౌడిపల్లి వంటి మండలాల్లో 80 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. తాజాగా అందె గ్రామంలో ఒకే ఫామ్‌లో 8 వేల కోళ్లు చనిపోవడం కలకలం రేపింది. దీంతో కోళ్ల ఫారాలన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.