పాక్‌లో మరో ఉగ్రదాడి.. ముగ్గురు పోలీసులు మృతి
పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదులపై కాల్పులు జరగగా.. 22 మంది హతమయ్యారు. ప్రస్తుతం గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.