‘స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడాలి’

‘స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడాలి’

కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన అఖిల భారత స్పీకర్ల సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు నిష్పక్షపాతంగా వ్యవహరించి.. సభా నియమాల ప్రకారం కార్యకలాపాలు జరిగేలా చూడాలని చెప్పారు. అసెంబ్లీలు తమ గౌరవాన్ని కోల్పోయినప్పుడు భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.