VIDEO: రైల్వే కమాన్ కూలడంతో భారీ ట్రాఫిక్ జామ్
NLG: మిర్యాలగూడ పట్టణంలో ఐకేపీ ధాన్యం హెలీ వుడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ రైల్వే ట్రాక్‌లోని కమాన్‌ను ఢీకొట్టడంతో అది కుప్పకూలింది. వెంకటాద్రిపాలెంలో రైస్ మిల్లుకు చిట్యాలలోని పిట్టంపల్లి నుంచి ధాన్యం తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో రైల్వే కమాన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.