VIDEO: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
MNCL: కోటపల్లి మండలంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని సిర్సా గ్రామంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చనలు వైభవోపేతంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో భక్తులు అశేషసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.