నేడు విద్యుత్ సరఫరాయకు అంతరాయం

NZB: నవీపేట్ మండల కేంద్రంలోని జండేపల్లి, కమలాపూర్, రాంపూర్‌తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ట్రాన్స్‌కొ ఈడీఈ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నవీపేట్, రాంపూర్ సబ్ స్టేషన్లలో మరమ్మత్తుల నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని. ఈ అంతరాయంపై వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.