'సురక్షితమైన ఉత్పత్తులే వినియోగదారుని లక్ష్యం'
VZM: ప్రతి వినియోగదారులకు తమ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమేనని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం “సురక్షిత ఉత్పత్తులు - నమ్మకమైన వినియోగదారులు“ అనే అంశంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.