VIRAL: ఆదర్శంగా నిలిచిన కొత్త జంట
టర్కీలో జరిగిన ఓ పెళ్లి వేడుక అందరి హృదయాలను గెలుచుకుంది. సాధారణంగా ఎవరైనా పెళ్లికి బహుమతులు తీసుకురమ్మని కోరుకుంటారు.. కానీ, ఈ జంట మాత్రం వాటికి బదులుగా అనాథ పిల్లలను అతిథులుగా తీసుకురావాలని కోరారు. ఈ వేడుకకు 100 మందికి పైగా చిన్నారులు హాజరయ్యారు. అతిథులు తెచ్చిన బహుమతులను ఆ దంపతులు అనాథ పిల్లలకే పంపిణీ చేసి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు.