కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VKB: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బషీరాబాద్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు రూ. 63,07,308 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండలంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.