అంత్యక్రియలు చేసిన శవాన్ని బయటకు తీసిన యువకులు
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో బొంద పెట్టిన శవాన్ని బయటకు తీసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపల్లె శివారులోని కొందరు జైపూర్ యువకులు అంత్యక్రియలు చేసిన సమాధి నుంచి మృతదేహాన్ని తవ్వితీశారు. ఇది గమనించిన స్థానికులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పూడ్చి పెట్టిన శవాన్ని ఎందుకు తీస్తున్నారని పోలీసులు యువకులను ప్రశ్నించారు.