అంచనాల కమిటీ సభ్యునిగా గూడూరు ఎమ్మెల్యే

నెల్లూరు: రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ సభ్యునిగా గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమారును బుధవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియమించారు. శాఖల వారిగా ఖర్చులు, నిధులు వినియోగం పరిశీలించడం కోసం ఏర్పాటు అయ్యే అత్యధిక సభ్యులు కలిగిన కమిటీలో సభ్యునిగా నియమించిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.