ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
HNK: ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామం వద్ద బుధవారం రాత్రి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కారులో తరిగొప్పుల మండలం నర్సాపూర్‌కు చెందిన ఏడుగురు యువకులు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా సమాచారం. వరంగల్ వెళ్లి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.