సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి: ఎస్పీ

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి: ఎస్పీ

GDWL: సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఎస్పీ శ్రీనివాసరావు సైబర్ వారియర్స్ బృందాన్ని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ మొగిలయ్యతో కలిసి సైబర్ వారియర్స్, డీ4సీ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా సైబర్ సెల్‌తో సమన్వయం చేసుకుంటూ సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద కంటెంట్‌పై నిఘా ఉంచాలన్నారు.