మరికల్ మండలంలో సర్పంచ్ బరిలో 46 మంది
NRPT: మరికల్ మండలంలోని 17 గ్రామపంచాయతీలో రెండో విడత ఎన్నికల్లో 46 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచినట్లు మరికల్ ఎంపీడీవో పృథ్వీరాజ్ తెలిపారు. అత్యధికంగా పెద్ద చింతకుంటలో ఐదు మంది, అత్యల్పంగా 8 గ్రామపంచాయతీలో ఇద్దరు చొప్పున పోటీలో ఉన్నట్లు తెలిపారు. 166 వార్డులకు గాను 10 వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 156 వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.