మెదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం

మెదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం

BPT: కొరిశపాడు మండలం మెదరమెట్లలోని భ్రమర వెంచర్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలం నుండి గ్రోత్ సెంటర్ మీదగా అమ్మనబ్రోలుకు వెళ్తున్న అశోక్ లైలాండ్ ఆటో డివైడర్‌ను ఎక్కించడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.