సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున

విశాఖ: జిల్లా కలెక్టర్ మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నరసింహ మహాయజ్ఞ కార్యక్రమం తిలకించారు. అప్పన్నను దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దంపతులు యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, అర్చకులు పాల్గొన్నారు.