VIDEO: ఘనంగా ఎల్లమ్మ దేవత ఉత్సవాలు
NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో వెలసిన ఎల్లమ్మ ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బైండ్ల వారు ఎల్లమ్మ, రాక్షసుని వేషధారణలతో గ్రామంలో ఊరేగుతూ భక్తులను అలరించారు. శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఎల్లమ్మ కథను ఘనంగా నిర్వహించగా, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని వీక్షించారు.