రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.