కోరుకొండలో పులి సంచారం కలకలం
E.G: కోరుకొండ మండలం కాపవరంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అటవీ శాఖ అధికారులు అత్యాధునిక ట్రాకింగ్ సిస్టం ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.