ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

WGL: రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరగాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల ధాన్యం తక్షణమే కొలిచేలా, చెల్లింపులు సమయానికి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.