సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం ఏంటి: ఎమ్మెల్యే వరద
కడప: సివిల్ కేసుల్లో పొద్దుటూరు పోలీసుల జోక్యం ఏమిటని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. ఆయన ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారి శ్రీనివాసులు ఆయన సోదరుడు వెంకటస్వామిలను పోలీసులు దొంగల్లా, టెర్రరిస్టుల్లా బలవంతంగా తీసుకువెళ్లారన్నారు.