బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన, బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లడానికి ముందు ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు బోనాలతో తరలివచ్చి ఇవాళ బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.