ఈనెల 30న పోచమ్మ తల్లి ఆలయ రెండో వార్షికోత్సవం
SRD: హత్నూర మండలం కాసాల గ్రామం 12వ వార్డులో నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయ రెండో వార్షికోత్సవ ఉత్సవాలు ఈనెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఇవాళ తెలిపింది. ఉదయం 8 గంటలకు హోమం, అమ్మవారికి అలంకరణ, అభిషేక కార్యక్రమం, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.