విదేశీ పర్యటనకు ఉపాధ్యాయుడు ఎంపిక
MDK: జిల్లాకు గర్వకారణంగా పెద్దశంకరంపేట ఉపాధ్యాయుడు కోయిలకొండ బాలాజీ నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్' కార్యక్రమంలో భాగంగా, ప్రపంచస్థాయి బోధనా పద్ధతుల అధ్యయనం కోసం ఆయన విదేశాలకు ఎంపికయ్యారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వీన్ నికోలాస్ విడుదల చేసిన జాబితాలో బాలాజీ చోటు దక్కించుకోవడం విశేషం.