పేకాట ఆడుతున్న ముగ్గురిపై కేసు నమోదు

పేకాట ఆడుతున్న ముగ్గురిపై కేసు నమోదు

VZM: ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పట్టణ సీఐ వి.నారాయణమూర్తి మంగళవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2,800 నగదును స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోలీసు స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.