పొలంలో అగ్నికి ఆహుతి అయిన వరి కుప్ప
SKLM: పలాస మండలం తర్లాకోట పంచాయితీ గట్టూరు సమీప పొలంలో శనివారం మధ్యాహ్నం వరికుప్ప అగ్నికి ఆహుతి అయ్యింది. పొత్రియ గ్రామానికి రైతు సవర సుంకయ్య సుమారు ఎకరా పొలంలో కోతలు అనంతరం కుప్పగా వేశారు. శనివారం ఒక్కసారిగా మంటలను గమనించిన సమీప పొలాల్లో ఉన్న రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం తనని ఆదుకోవాలని కోరారు.