రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోడ్చన్ పల్లి గ్రామానికి చెందిన పచ్చ దేవరాజు (17) మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇంటర్ చదువుతున్న దేవరాజ్ క్యాటరింగ్ పనులు చేసేందుకు వెళ్లి ఆటోలో వస్తుండగా బోల్తా పడింది. గాయపడిన దేవరాజ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.