'శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు'
కోనసీమ: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని నాలుగు డిపోల నుంచి భద్రాచలానికి 15 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 26 నుంచి AMP ,RZL,RVPM ,RMCP డిపోల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9:30, 10:30, మధ్యాహ్నం 12:30, 1:30, 3:00 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు.