తరంపూడిలో పర్యటించిన ఎమ్మెల్యే
AKP: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గురువారం తరంపూడి గ్రామంలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం, రైతు సేవా కేంద్రం, పీహెచ్సీని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో ముచ్చటించారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా ఆటపాటలతో విద్యాబోధన చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.