కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

SKLM: కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా వీడియో పోటీలు నిర్వహించనున్నట్టు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. అమ్మవారి వైభవం, చరిత్ర, గత ఉత్సవాల జ్ఞాపకాలు ప్రతిబింబించేలా 3 నుంచి 5 నిమిషాల వీడియోలు రూపొందించాలన్నారు. ఈ నెల 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు పంపాలన్నారు.