శ్రీశైల జలాశయానికి తగ్గిన వరద

NDL: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం స్పల్పంగా తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం 4గేట్లలో ఓ గేటును మూసివేశారు. ప్రస్తుతం కేవలం 3గేట్ల ద్వారా 83,184 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అదనంగా కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,893 క్యూసెక్కులు, ఎడమ భూగర్భ జలకేంద్రానికి నీటిని విడుదల చేశారు.