ఊరుగొండ–ఎన్ఎస్ఆర్ హోటల్ మధ్య వన్-వే అమలు
HNK: దామెర మండలం ఊరుగొండ–ఎన్ఎస్ఆర్ హోటల్ మధ్య జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో శనివారం నుంచి వారం రోజుల పాటు వన్-వే విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనదారులు ఓవర్‌టేకింగ్‌లు చేయవద్దని ఎస్సై కొంక అశోక్ సూచించారు. అలాగే నెమ్మదిగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలి అన్నారు.