గడ్డకట్టిన సిమెంట్ బస్తాలు
KRNL: నాడు-నేడు పథకం కింద పాఠశాలకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. పెద్దకడబూరు KGBV కళాశాలలో దాదాపు 100 సిమెంట్ బస్తాలు పూర్తిగా గడ్డకట్టి వినియోగానికి ఉపయోగపడని స్థితికి మారాయి. సిమెంట్ బస్తాల నిల్వ కారణంగా తరగతి గదుల్లోకి దుమ్ము చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కళాశాల సిబ్బంది తెలిపారు. వాటిని తొలగించాలని కోరారు.