కిలాడి లేడి అరెస్ట్
BPT: జిల్లాలో కిలాడీ లేడిని ఇంకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై SP ఉమామహేశ్వర్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన కావటి లలిత జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తోందని తెలిపారు. ఆమె వద్ద నుంచి 136 గ్రా.ల బంగారం, రూ.15 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే ఈమెపై తెలుగు రాష్ట్రాల్లో 17 కేసులు ఉన్నట్లు చెప్పారు.