మత్స్యకారులకు ఆధునిక బోట్లు ఇంజిన్ పంపిణీ
SKLM: మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం మొగదాలపాడు గ్రామంలో బుధవారం నాడు శ్రీకూర్మం, మొగదాలపాడు, బలరాంపురం గ్రామాల మత్స్యకారులకు నూతన నైలాన్ వలలు, ఆధునిక బోట్ల ఇంజన్లు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.