కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల ఫైర్
TG: కొండగట్టు అంజన్న ఆలయ నిర్వహణపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయాల నిధులు, నగలు, కానుకలు కావాలని.. కానీ సదుపాయాలు మాత్రం కల్పించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ఆలయానికి వచ్చిన వారికి ప్రసాదాలు అందడంలేదని ఆరోపించారు. కాగా నిన్న సలేశ్వరం జాతరలో కూడా సరైన సౌకర్యాలు లేవని భక్తులు తెలిపారు.