రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

చిత్తూరులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పరిశీలించారు. మంగళవారం పలమనేరు రోడ్డులో దర్గా సర్కిల్ నుంచి ఇరువారం వరకు జరుగుతున్న విస్తరణ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కణ్ణన్ కళాశాల వద్ద జరుగుతున్న ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులు, కాంట్రాక్టర్‌లకు ఆదేశించారు.