'దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి'

'దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి'

BDK: మణుగూరు మండలం సమితి సింగారంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గుండి గౌరీ ప్రచార రథం డ్రైవర్‌పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దీన్ని నిరసిస్తూ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి కదలం అని ధర్నా చేశారు.