కాకర్ల డ్యామ్‌లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన ఫైర్ సిబ్బంది
ప్రకాశం: అర్ధవీడు మండలం కాకర్ల సమీపంలోని డ్యాం వద్ద నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో నలుగురు వ్యక్తులు నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న కంభం అగ్ని మాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా రక్షణా చర్యలు చేపట్టారు. సురక్షితంగా నలుగురిని కాపాడారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.