కరెంట్ పోవడంతో ఆక్వా రైతుల ఇబ్బందులు

BPT: కర్లపాలెం మండలం తుమ్మలపల్లి గ్రామంలో గత రాత్రి వీచిన భారీ గాలులకు కరెంటు స్తంభాలు నేలకూలాయి. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో జనరేటర్లతో ఫ్యాన్లు నడపాల్సి వస్తుందని, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ ఏఈ భానును వివరణ కోరగా, మరికొన్ని గంటల్లో విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.