జాబ్ మేళా వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

జాబ్ మేళా వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో ఇవాళ జరగనున్న మెగా జాబ్ మేళా వాయిదా పడింది. వాయిదా పడిన జాబ్ మేళాను ఈ నెల 7వ తేదీన ఏర్పాటు చేస్తామని కాలేజ్ ప్రిన్సిపల్ కొప్పుల మల్లేశం తెలిపారు. ఈ జాబ్ మేళాలో టాటా ఎలక్ర్టానిక్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి తదితర కంపెనీలు పాల్గొనున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాని వినియోగించుకోవాలని సూచించారు.