నదిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

VZM: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది. పాలకొండ మండలం అన్నవరంలో బంధువుల ఇంటికి వచ్చిన పవన్ (16) నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. మృతి చెందిన పవన్ ఆమదాలవలస మండలం వజ్రగూడ గ్రామానికి చెందినవాడు. సెలవులకు బంధువుల ఇంటికి వచ్చి మృతి చెందడంతో ఇటు అన్నవరంలోనూ అటు వజ్రగూడ గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.