ఏఎస్పీ చైతన్య రెడ్డిపై పూల వర్షం

ఏఎస్పీ చైతన్య రెడ్డిపై పూల వర్షం

KMR: ఏఎస్పీగా సేవలందించిన బి.చైతన్య రెడ్డి పదోన్నతిపై సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు సభలో ఎస్ఐలు, సిబ్బంది ఆమెపై పూలవర్షం కురిపిస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో ఆమె చూపిన సాహసం, అంకితభావం మరువలేనివని కొనియాడారు. తోటి అధికారుల చప్పట్లు, శుభాకాంక్షల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.